AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీ మున్సిపల్ ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మీకోసం..లైవ్ అప్డేట్స్..
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీలో 12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై.. సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.
Live Updates
- 14 March 2021 8:53 AM IST
AP Municipal Elections Results 2021: తూర్పుగోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లాలో లెక్కింపు ఇలా..
- ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం- మొత్తం 15 గదుల్లో 81 లెక్కింపు టేబుళ్ల ఏర్పాటు
- కౌంటింగ్ ప్రక్రియ సమస్తం వీడియోలో చిత్రీకరణ
- సాయంత్రం నాలుగు గంటలలోగా పూర్తి ఫలితాల వెల్లడి
- పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, ఏలేశ్వరంలో నాలుగు రౌండ్లు
- తుని మున్సిపాల్టీలో కేవలం రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి



