ఆ జీవోపై మీ స్టాండ్ ఏమిటి .. మీరు రాయలసీమ బిడ్డేనా.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ తీవ్ర విమర్శలు

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

Samba Siva Rao
Updated on: 13 May 2020 2:07 PM IST
ఆ జీవోపై మీ స్టాండ్ ఏమిటి .. మీరు రాయలసీమ బిడ్డేనా.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ తీవ్ర విమర్శలు
X
Chandrababu Naidu (File Photo)

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలన్నారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలించే జీవో 203పై అభిప్రాయం చెప్పాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. అడ్డమైన విషయాలపై జూమ్‌లో మాట్లాడే చంద్రబాబుకు... ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా ? అని విజయసాయిరెడ్డి నిలదీశారు.అసలు మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..? అని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.





Samba Siva Rao

Samba Siva Rao

Next Story