చంద్రబాబు ఆయన కొడుక్కి సలహాలు ఇవ్వాలి : రోజా

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు.

Samba Siva Rao
Published on: 21 April 2020 9:31 PM IST
చంద్రబాబు ఆయన కొడుక్కి సలహాలు ఇవ్వాలి : రోజా
X
Roja (File Photo)

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఇటీవల రోజా ఇటీవల పుత్తూరులో ఓ బోరు బావి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. లాక్‌డౌన్ వేళ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సింది పోయి, హంగు హార్భాటాలతో నిర్వహించారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. దీనిపై రోజా స్పందిస్తూ.. చంద్రబాబు, టీడీపీ నేతలు పనిలేక సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. నియోకవర్గంలోని పేదలకు సహాయం చేస్తున్న తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రోజా విమర్శించారు.

టీడీపీ నేతలు పనికట్టుకుని బురదచల్లాలని చూస్తున్నారని, వారి బెదిరింపులకు తాను భయపడనని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో పుత్తూరులో తాగునీరివ్వలేదని, వైఎస్ జగన్ సీఎం అయ్యాక నీరందించారని రోజా అన్నారు. సీఎం జగన్ స్ఫూర్తిగా పేదలకు అండగా ఉంటున్నానని ఆమె అన్నారు. ఐదేళ్ల పాటు అధికారం అనుభవించిన టీడీపీ నేతలు సంపాదించి ఇంట్లో కూర్చుంటున్నారని విమర్శించారు.

కరోనా టెస్టులలో విషయంలో చంద్రబాబు అనవసర రాద్దాంతం చేస్తున్నారని, కరోనా పరీక్షల విషయంలో, రేషన్ పంపిణీలో సీఎం జగన్ ని అందరూ అభినందిస్తున్నారని రోజా అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా జగన్ పై ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. చంద్రబాబు సలహాలు తమకు అవసరంలేదని హైదరాబాద్ లో ఆయన కొడుక్కి సలహాలు ఇవ్వాలని సూచించారు. లోకేశ్ ఇంట్లో ఉండి కూర్చుని తిని సైక్లింగ్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story