తిరుమలలో రూల్స్ బ్రేక్ చేసిన ఏపీ మంత్రులు

X
Highlights
* టీటీడీ నిబంధనలు పెడచెవిన పెట్టిన ఏపీ మంత్రులు * శ్రీవారి దర్శనం అనంతరం..క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి అవంతి
admin25 Dec 2020 6:31 AM GMT
టీటీడీ నిబంధనలు పెడచెవిన పెట్టారు ఏపీ మంత్రులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి అవంతి దర్శించుకున్నారు. అనంతరం క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అన్యమత ప్రస్తావన తీసుకురాకూడదనే టీటీడీ నిబంధనలు బేఖాతరు చేశారు. మంత్రుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రుల వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Web TitleAndhra Pradesh ministers break the rules in Thirumala temple
Next Story