Coronavirus: ఏపీలో ప్రమాద ఘంటికలు.. లక్షణాలు లేకున్నా 14 మందికి కరోనా పాజిటివ్

Coronavirus: ఏపీలో ప్రమాద ఘంటికలు.. లక్షణాలు లేకున్నా 14 మందికి కరోనా పాజిటివ్
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కాగా.. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కాగా.. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కోవిడ్ పరీక్షలు నిర్వహించిన 14 మంది లో లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ మేరకు మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ..జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఏవీ లేకుండా, ఆరోగ్యంగా ఉన్నా కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు.

కరోనా వ్యాధి లక్షణాలు లేకపోయినా వైరస్ సోకవచ్చని కొత్తగా నిర్వహించిన పరీక్షల్లో తెలిసిందని మంత్రి వ్యాఖ్యానించారు.ఏపీకి ప్రమాదఘంటికలు మోగుతున్నాయని ఆయన హెచ్చరించారు. బుధవారం ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87కు చేరిందని గుర్తు చేశారు. కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు బయటకు రాకుండా, ఇళ్లకే పరిమితం కావాలని హితవు పలికారు.

రాష్ట్రంలో ప్రజలు భయపడే వాతావరణం వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విజయవాడ సహా పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించామని, దీంతో 24 గంటల కర్ఫ్యూ విధించినట్లు మంత్రి తెలిపారు. రెడ్ జోన్ వున్న ప్రాంతాల ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకూడదని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా 6 నుంచి 11 గంటల వరకు బయటకు వెళ్లే అనుమతి ఉందని చెప్పి విచ్చలవిడిగా తిరగొద్దని మంత్రి నాని హితవు పలికారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories