Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

Andhra Pradesh: జీవో నెం.2ను సస్పెండ్ చేసిన న్యాయస్థానం * ఏపీ ప్రభుత్వంపై న్యాయస్థానం ప్రశ్నలు

Sandeep Eggoju
Published on: 12 July 2021 3:18 PM IST
Andhra Pradesh High Court Suspend the GO Number 2
X

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. జీవో నెంబర్‌ 2ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్‌వోలకు అప్పగిస్తూ జారీచేసిన జీవో నెంబర్ 2ను రద్దు చేసింది. జీవోను సవాల్‌ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. పంచాయతీ సర్పంచ్‌ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇప్పటి వరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను వీఆర్‌వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు నిలదీసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story