గుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్ మృతి

Raj
By Raj
Published on: 24 Jun 2020 4:45 PM IST
గుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్ మృతి
X

ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన బుధవారం హైకోర్టులో విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటు రావడంతో.. ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన మార్గం మధ్యలో మరణించినట్టు సమాచారం.

రిజిస్ట్రార్ జనరల్ మృతిచెందారన్న విషయం తెలుసుకున్న రాజశేఖర్ సహ ఉద్యోగులు కొందరు ఆసుపత్రికి చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. అప్పటివరకూ తమవద్ద విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ అకాలమరణం చెందడంతో సహోద్యగులు షాక్ లో మునిగిపోయారు. కాగా ప్రస్తుతం ఆయన ఇన్ చార్జీ రిజిస్ట్రార్ జనరల్ గా ఉన్నారు. కొత్తగా మరో మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్ గా నియమించారు. అయితే ఆమె చార్జీ తీసుకున్న మరుసటి రోజే రాజశేఖర్ మరణించారు.


Raj

Raj

Next Story