AP High Court - Go 35: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు

Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri
Updated on: 20 Dec 2021 3:53 PM IST
Andhra Pradesh High Court Key Orders on GO 35
X

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court - Go 35: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్‌ ధరల నియంత్రణపై జీవో 35 రద్దు అందరికీ వర్తిస్తుందని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. గత విచారణలో పిటిషనర్లకు మాత్రమే జీవో నుంచి మినహాయింపు వర్తింస్తుందని హోమ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ తెలిపారు.

నేటి విచారణలో జీవో అందరికీ వర్తిస్తుందని డివిజన్‌ బెంచ్‌ చెప్పింది. ధరల పెంపుపై ప్రతిపాదనలు జాయింట్‌ కలెక్టర్లకు పంపాలన్న బెంచ్‌ వివరాలను అడిషనల్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story