Gender Budget: 2021-22 సంవత్సరానికి ఏపీలో జెండర్ బేస్డ్ బడ్టెట్

Arun Chilukuri
Published on: 8 March 2021 7:21 PM IST
Andhra Pradesh govt to introduce Gender budget
X

2021-22 సంవత్సరానికి ఏపీలో జెండర్ బేస్డ్ బడ్టెట్ 

Gender budget: 2021-22 ఆర్ధిక సంవత్సరానికి జెండర్ బేస్డ్ బడ్జెట్‌ కు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళ, శిశు సంక్షేమం కోసం ఉద్దేశించిన నిధులతో ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక జెండర్ బడ్జెట్ తయారు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం వివిధ సంక్షేమ నిధులను ప్రత్యేకిస్తూ బడ్జెట్ రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు, బాలికలతో పాటు 18 ఏళ్ల లోపు వయస్సున్న మైనర్ల కోసం వెచ్చిస్తున్న నిధుల్ని ప్రత్యేక బడ్జెట్ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహిళా-శిశు, దివ్యాంగ వృద్ధుల బడ్జెట్ అమలుకు మహిళా శిశు సంక్షేమ శాఖ నోడల్ విభాగంగా వ్యవహరిస్తుందని ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story