Andhra Pradesh Government Transfers : ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ బదిలీ
Andhra Pradesh government transfers : ఏపీలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ అయ్యారు. ఆయనను ఏపీఎస్పి బెటాలియన్ అడిషనల్ డిజి గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉన్నట్టుండి మాదిరెడ్డి ప్రతాప్‌ను బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. మాదిరెడ్డి ప్రతాప్ లాక్‌డౌన్, కరోనా సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే కృష్ణబాబు కూడా గతంలో ఆర్టీసీ ఎండీగా పనిచేశారు.
Next Story




