logo
ఆంధ్రప్రదేశ్

అన్‌లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. స్కూళ్లు తెరిచేది ఎప్పుడంటే..

అన్‌లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. స్కూళ్లు తెరిచేది ఎప్పుడంటే..
X
Highlights

Unlock 4.0 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్ 4 మార్గ దర్శకాలను విడుదల చేసింది. కేంద్రం...

Unlock 4.0 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్ 4 మార్గ దర్శకాలను విడుదల చేసింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ లాక్ 4 మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 21 నుండి 9, 10, ఇంటర్ విద్యార్థులు కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దీనికి తల్లిదండ్రుల రాత పూర్వకంగా అంగీకారం తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఈ నెల 21 నుంచి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా అదే రోజునుంచి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది.

సెప్టెంబర్ 21 నుంచి వంద మందికి మించకుండా విద్యా, సామాజిక, స్పోర్ట్స్, మతపరమైన, రాజకీయ సమావేశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే పెళ్లిళ్లకు 50 మంది దాకా అతిథులు హాజరు కావచ్చు. అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి ఉండకూడదు. 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులకు అనుమతి నిరాకరించింది.Web TitleAndhra Pradesh Government released Unlock 4.0 guidelines
Next Story