Andhra Pradesh: మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Andhra Pradesh: ఏపీలోని మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

Arun Chilukuri
Published on: 18 Dec 2021 7:33 PM IST
Andhra Pradesh Government Reduced Vat on Liquor
X

Andhra Pradesh: మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Andhra Pradesh: ఏపీలోని మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. వ్యాట్‌, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ మార్జిన్‌లో మార్పులతో ఏపీలో మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇండియన్‌మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం ధరలు తగ్గనుండగా మిగిలిన అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకు రేట్లు తగ్గనున్నాయి. వచ్చేవారం నుంచి అన్ని మద్యం దుకాణాల్లో ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం అమ్మకాలు అందుబాటులోకి రానున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటుసారా తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story