logo
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
X
Highlights

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు...

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో కరువు భత్యం 27.248 నుంచి 30.392కు పెరిగింది. 2021 జనవరి జీతాలతో కలిపి నగదుగా చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2018, జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు 30 నెలల బకాయిలు జీపీఎఫ్‌, జడ్పీపీఎఫ్ వారికి 3 సమ భాగాల్లో పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయనుంది. సీపీఎస్ వారికి 30 నెలల ఆరియర్స్ 90 శాతం నగదుతో పాటు 10 శాతం ప్రాన్‌ అకౌంట్‌కు జనవరి జీతాల చెల్లింపు తర్వాత 3 సమ భాగాల్లో జమ చేస్తామంది. 2019 జనవరి డీఏ 2021 జులై నుంచి.. 2019 జులై డీఏ.. 2022 జనవరి నుంచి చెల్లించడానికి హామీ ఇచ్చింది.

Web TitleAndhra Pradesh Government issued orders of da hike to government employees
Next Story