logo
ఆంధ్రప్రదేశ్

Dulhan Scheme: ఏపీలో దుల్హన్ పథకం నిలిపివేత

Andhra Pradesh Government has Stoped Dulhan Marriage Scheme
X

Dulhan Scheme: ఏపీలో దుల్హన్ పథకం నిలిపివేత

Highlights

Dulhan Scheme Stopped in AP: "దుల్హన్‌" పథకాన్ని నిలిపివేసినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Dulhan Scheme Stopped in AP: "దుల్హన్‌" పథకాన్ని నిలిపివేసినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టుకు నివేదించింది. దుల్హన్ పథకం అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ పథకం అమలుపై హైకోర్టుకు స్పష్టత ఇచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో ఈ పథకం నిలిపివేసినట్లు నివేదికలో పేర్కొంది. పేద ముస్లిం మైనారిటీ యువతులకు పెళ్లి సందర్భంగా రూ.50 వేలు ఆర్థికసాయం ఈ పథకం ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే.

Web TitleAndhra Pradesh Government has Stopped Dulhan Marriage Scheme
Next Story