Express Highway in AP: కుదించిన ఎక్స్ ప్రెస్ వే.. వేల కోట్లలో నిధులు ఆదా

Express Highway in AP: ఏపీ సీఎంగా జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన దగ్గర్నుంచి, నిధుల వ్యయంలో దుబరాను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటోంది.
Express Highway in AP: ఏపీ సీఎంగా జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన దగ్గర్నుంచి, నిధుల వ్యయంలో దుబరాను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటోంది. అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే ప్రణాళికల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంటుంది. అనంతపురం - అమరావతి ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంలో ఇదే విధంగా చర్యలు తీసుకుంది.
టీడీపీ హయాంలో అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎక్స్‌ప్రెస్ వేను కోల్‌కతా-చెన్నై(ఎన్‌హెచ్ 16) రహదారికి సమాంతరంగా నిర్మించాలని అప్పటి ప్రభుత్వం భావించింది. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో జగన్ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ వేను ఎన్‌హెచ్ 16కు సమాంతరంగా నిర్మించడానికి బదులు ఎన్‌హెచ్ 16తో అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
అంతేకాదు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంకు ప్రతిపాదనలు పంపగా.. అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో మరో 47 కిలోమీటర్ల దూరం(గతంలో 101కి.మీలు) తగ్గనుండటంతో పాటు 741 హెక్టార్ల భూమిని సేకరించే ప్రతిపాదనలను వెనక్కి తీసుకోనున్నారు. దీంతో రూ.3,500 కోట్ల ఖర్చు తగ్గింది. కాగా ఈ ఎక్స్‌ప్రెస్ వేలో భాగంగా రూ.867 కోట్లతో చిలకలూరి పేట బైపాస్ నిర్మాణం ప్రారంభమైంది.
ఎక్స్‌ప్రెస్ వే వివరాలు:
అనంతపురం మొదలు వైఎస్సార్ కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టనున్నారు. ఇక ఈ ఎక్స్‌ప్రెస్ వే రూ.27,635 కోట్లు ఖర్చు అవుతాయని అప్పటి ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ.. తాజా మార్పులతో రూ.3,500కోట్లు ఆదాయం అవ్వనున్నాయి. ఇక ఈ ఎక్స్‌ప్రెస్‌వే వలన 148 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గడంతో పాటు 2 గంటల ప్రయాణ సమయం ఆదా అవ్వనుంది.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMTమన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMTవ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న
29 Jun 2022 2:08 AM GMTONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్కు ప్రమాదం
29 Jun 2022 1:29 AM GMTMeena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
29 Jun 2022 1:16 AM GMT