జిల్లాల కలెక్టర్లకు అధికారాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

జిల్లాల కలెక్టర్లకు అధికారాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

కరోనా మహమ్మారి రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.

కరోనా మహమ్మారి రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు, స్వాధీనం చేసుకునే పూర్తి అధికారాన్ని కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. వైద్యశాలలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది.

కరుణ కేసులు పెరిగితే ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాలలు వాటికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రులను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొంది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి ఐసోలేషన్ వార్డులకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది.వైద్యులు, పారామెడికల్ సిబ్బందీని, నర్సులు ను, టెక్నీషియన్లు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories