ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 133 రెడ్ జోన్లు... ఆ ప్రాంతాలకు నో ఎంట్రీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 133 రెడ్ జోన్లు... ఆ ప్రాంతాలకు నో ఎంట్రీ
x
Representational Image
Highlights

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాలను కరనా రెడ్ జోన్లుగా గుర్తించి వాటిని సీల్ చేసింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో పేషెంట్ నెం. 191 నుంచి 250 వరకు రోగుల నివాస స్థలాలు ఉండే ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లోకి బయటి నుంచి ఎవరినీ అనుమతించరు. అక్కడున్న ప్రజలను బయటకు పంపించరు.

అత్యవసర సేవలు, ప్రభుత్వ సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు కోవిడ్19పై అవగాహన కల్పిస్తారు. కోవిడ్-19 పాజిటివ్ కేసులున్న ప్రాంతం నుంచి 3 కి.మీ. చుట్టూ ఉన్న ప్రాంతాలన్నింటినీ కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా భావిస్తారు.

వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న 5 కి.మీ. ప్రాంతం కూడా బఫర్ జోన్‌గా గుర్తిస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బఫర్ జోన్లను 7 కి.మీ. వరకు విస్తరించారు. ఆయా ప్రాంతాలను కలిపే రహదారులు పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయి.

రాష్ట్రంలో మొత్తం 365 కేసులు నమోదు కాగా, 10 మంది డిశ్చార్జి అయ్యారు. ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఇంకా 349 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే అనంతపూర్‌లో 15, చిత్తూరులో 20, తూర్పు గోదావరిలో 12, గుంటూరులో 51, కడపలో 29, కృష్ణాలో 35, కర్నూలులో 75, నెల్లూరులో 48, ప్రకాశంలో 38, శ్రీకాకుళంలో సున్నా, విశాఖపట్నంలో 20, విజయనగరంలో సున్నా, పశ్చిమ గోదావరిలో 22 కేసులు నమోదయ్యాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories