ఈనెల 10న సుప్రీంలో నిమ్మగడ్డ కేసు విచారణ

S. Srikanth
Published on: 6 Jun 2020 10:41 PM IST
ఈనెల 10న సుప్రీంలో నిమ్మగడ్డ కేసు విచారణ
X
Nimmagadda Ramesh Kumar (File Photo)

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీ కాలాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ జీవోలను కూడా కొట్టివేసింది. ఏపీ ఎస్ఈసీగా కనగరాజ్ నియామకం చెల్లదంటూ స్పష్టం చేసింది. నిమ్మగడ్డను పునర్‌ నియమించాలంటూ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. . ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు జూన్ 10న సుప్రీమ్ కోర్టులో విచారణకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి అయిన బాబ్డే, న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన లీవ్ పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ స్వీకరించింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


S. Srikanth

S. Srikanth

Next Story