దేవుడితో చెలగాటమాడితే అంతే: సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

దేవుడితో చెలగాటమాడితే అంతే: సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
x
Highlights

ఏపీలో వరుస విగ్రహాల ధ్వంసం ఘటనలపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన..,...

ఏపీలో వరుస విగ్రహాల ధ్వంసం ఘటనలపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.., విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంపై దాడి ఘటనపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలు దారుణమని ఆయన అన్నారు. దేవుడితో చెలగాటమాడితే ఖచ్చితంగా శిక్షిస్తాడని తెలిపారు. విగ్రహాల ధ్వంసం కేసుల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పోలీస్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. వివిధ అంశాలపై సీఎంఓ అధికారులతో ఇవాళ సమీక్షించిన జగన్‌.. అర్హత ఉండి ఇంటిపట్టా రాలేదనే మాట వినిపించకూడదన్నారు. అనర్హుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories