రేపే జగనన్న చేదోడు పథకం ప్రారంభం

S. Srikanth
Published on: 9 Jun 2020 9:59 PM IST
రేపే జగనన్న చేదోడు పథకం ప్రారంభం
X
YS Jagan (File Photo)

సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. శాచ్యురేషన్ పద్ధతిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం తెలిపిన విషయం తెలిసిందే. అయితే అదే విధంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు.

ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం జగనన్న చేదోడు పథకం ప్రారంభించనున్నారు. క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నరూ సీఎం జగన్. ముందుగా ప్రకటించిన విధంగా షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పధకం ద్వారా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం చేకూరనుంది. అలాగే కరోనా కష్టకాలంలోనూ పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది అని తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story