సీఎం జగన్ కి అరుదైన గౌరవం.. ప్రజాదరణ కలిగిన సీఎంల జాబితాలో టాప్ 4..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది.

Samba Siva Rao
Updated on: 2 Jun 2020 6:37 PM IST
సీఎం జగన్ కి అరుదైన గౌరవం.. ప్రజాదరణ కలిగిన సీఎంల జాబితాలో టాప్ 4..
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలో అత్యధిక పాప్యులారిటీ (ప్రజాదరణ) ఉన్న ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నాలుగో స్థానంలో నిలిచారని వైసీపీ తెలిపింది. తాజాగా సీ-ఓటర్‌ సర్వేలో ఈ విషయం తేలిందని చెప్పింది వైసీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.

ఈ జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్ మఖ్యమంత్రి భూపేష్ బఘేల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ తర్వాత ఐదు, ఆరు, ఏడో స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు నిలిచారని వైసీపీ తమ ట్విట్టర్‌ అకౌంట్ లో తెలిపింది.



HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Samba Siva Rao

Samba Siva Rao

Next Story