AP CM YS Jagan About Racha Banda Program: గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం : సీఎం జగన్!

AP CM YS Jagan About Racha Banda Program:  గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం : సీఎం జగన్!
x
YS Jagan (File Photo)
Highlights

AP CM YS Jagan About Racha Banda Program: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు.

AP CM YS Jagan About Racha Banda Program: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత గ్రామాల్లో రచ్చబండ నిర్వహిస్తాని ప్రకటించారు. అమలు అవుతున్న పథకాలు తీరును స్వయంగా పరిశీలించేందుకు స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తానని అయన వెల్లడించారు. ఇక కరోనా నియంత్రణ చర్యలు, తదితర అంశాలపై మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రచ్చబండపై ప్రకటన చేశారు.

అనంతరం ట్విట్టర్ వేదికగా అయన స్పందిస్తూ .. "ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవుతున్నాయా లేదా అన్న దానిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టాక రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రజల సమస్యలు, పథకాలు అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటిస్తాను." అని సీఎం జగన్ పేర్కొన్నారు.



గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టన అనంతరం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రచ్చబండ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆ కార్యక్రమం కోసం అయన ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో బయల్దేరగా మధ్యలో ప్రమాదం జరిగి మృతి చెందారు. వైఎస్సార్ మరణంతో ఆగిపోయిన రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు సీఎం జగన్ సంకల్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories