CM Jagan: ఈరోజు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు సీఎం జగన్‌

CM Jagan: పనుల పురోగతిని నేరుగా పరిశీలించనున్న జగన్‌ * అనంతరం, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష

Sandeep Eggoju
Updated on: 19 July 2021 11:18 AM IST
Andhra Pradesh CM Jagan Going to Polavaram Project Today
X

పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించనున్న సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈరోజు పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోన్న జగన్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో రివ్యూ చేయనున్నారు. ఇంకా పూర్తి చేయాల్సిన పనులపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తారు. ఈ ఉదయం 10గంటల 10 నిమిషాలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న సీఎం జగన్‌. 11గంటలకల్లా పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చేరుకుని పనులను పరిశీలిస్తారు. అనంతరం, అధికారులతో సమీక్ష నిర్వహించి తిరిగి మధ్యాహ్నం 2గంటల 15 నిమిషాలకు తన నివాసానికి చేరుకుంటారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story