ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Chief Somu Veer Raju Sensational Comments on Visakhapatnam Steel Plant
x

Somu Veer Raju (file Image)

Highlights

* విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఏపీ బీజేపీ వ్యతిరేకం -సోము వీర్రాజు * ఈ నెల 14న బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్తాం -సోము వీర్రాజు

ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఏపీ బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మాధవ్‌, పలువురు కేంద్రమంత్రులను కలిశారన్నారు. అయినప్పటికీ.. ఈ నెల 14న బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నట్టు సోము వీర్రాజు చెప్పారు. జేపీ నడ్డా, ప్రధాని మోడీని కలిసి పరిస్థితులు వివరిస్తామన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునరాలోచించుకోవాలని కోరతామని సోము వీర్రాజు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories