ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేడు!

K V D Varma
Updated on: 19 Jan 2021 10:55 AM IST
CM Jagan
X

ఏపీ సీఎం జగన్‌ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి జగన్‌ ఢిల్లీకి పయనమవ్వనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా తో భేటీకానున్నట్లు తెలుస్తోంది. ఏపీలో తాజా పరిణామాలతో పాటు పలు అంశాలపై అమిత్‌షా‌ తో జగన్‌ చర్చించనున్నారు. అమిత్‌షా తో పాటు పలువురు కేంద్రమంత్రులను జగన్‌ కలువనున్నట్లు సమాచారం.

ఏపీలో ఆలయాల దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయం దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్, హోంమంత్రి అమిత్‌షాకు వివరించనున్నట్లు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

మరోవైపు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ జగన్‌ సమావేశంకానున్నారు. పెండింగ్‌ నిధులతో పాటు ప్రాజెక్టులు పూర్తయ్యేలా బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరే అవకాశం ఉంది.

K V D Varma

K V D Varma

Next Story