ఇళ్ళ పట్టాల పంపిణి ప్రారంభించిన జగన్

"నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు" పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం‌..

admin
Published on: 25 Dec 2020 3:55 PM IST
ఇళ్ళ పట్టాల పంపిణి  ప్రారంభించిన  జగన్
X

ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

"నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు" పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం‌.. నేటి నుంచి 15 రోజుల పాటు రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ జరుగుతోందన్నారు. పాదయాత్రలో ఇళ్లు లేని వారి కష్టాలు చూశాన్న జగన్.. వాళ్ల పరిస్థితి మార్చాలనే ఇళ్ల స్థలాల పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా 30 లక్షల మందికి లబ్ది చేకూరనుందని సీఎం స్పష్టం చేశారు.

admin

admin

Next Story