రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు

X
Highlights
టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి...
Arun Chilukuri18 Dec 2020 9:48 AM GMT
టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి రాయపాటి ఇంట్లో తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ విషయంలో తనిఖీలు జరుపుతున్నారు అధికారులు. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలో రాయపాటికి వాటాలున్నాయి. సదరు సంస్థ రుణాల ఎగవేతపై సీబీఐ కేసు నడుస్తోంది. ఇందులో భాగంగానే రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం 8గంటలకు సీబీఐ అధికారులు రాయపాటి నివాసానికి చేరుకున్నారు. ఆసమయంలో రాయపాటి కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోని వివిధ గదులు, కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
Web TitleAndhra Pradesh: CBI raids on former MP Rayapati Sambasiva Rao's house and office
Next Story