రేపు ఏపీ మంత్రివర్గం సమావేశం.. అసాధారణ రీతిలో భద్రత ఏర్పాట్లు

రేపు ఏపీ మంత్రివర్గం సమావేశం.. అసాధారణ రీతిలో భద్రత ఏర్పాట్లు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గ సమావేశం రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశం...

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గ సమావేశం రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం రాజధాని మార్పు, జీఎన్ రావు కమిటీ నివేదికపై సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కూడా చర్చిస్తారు. రైతుల ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాలపైనా కేబినెట్‌లో చర్చిస్తారు. ఇటు రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయాన్ని సేకరణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సీఆర్డీఏ ప్రాంతంలో ఐఏఎస్‌ అధికారులు కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి డబ్బులు తిరిగి చెల్లించే అంశం కూడా చర్చకు రానుంది.

మరోవైపు రేపటి కేబినేట్‌ భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై కృష్ణా, గుంటూరు జిల్లా నేతలతో సీఎం జగన్‌ సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న సమావేశంలో కేబినేట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. 3 రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన, అమరావతి ప్రాంత అభివృద్ధి వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. సమావేశం తర్వాత ప్రభుత్వ ప్రణాళికలను ఎమ్మెల్యేలు వివరించనున్నారు.

మరోవైపు రేపటి కేబినేట్ సమావేశానికి అసాధారణ రీతిలో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినేట్ సమావేశం సచివాలయంలో నిర్వహించాలా..? లేక సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించాలా అన్నదానిపై చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories