Cabinet Meeting: నేడు ఆంధ్రప్రదేశ్ కెబినెట్‌ భేటి

Cabinet Meeting: పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చ * రూ.4వేల కోట్ల ఆస్తులను ఆర్టీసీకి బదలాయించే అంశంపై చర్చ

Sandeep Eggoju
Updated on: 6 Aug 2021 11:06 AM IST
Andhra Pradesh Cabinet Meeting Going to be Start Soon
X

ఆంధ్రప్రదేశ్ కాబినెట్ సమావేశం (ఫైల్ ఇమేజ్)

Cabinet Meeting: నేడు కేబినెట్‌ భేటి కానుంది. సీఎం జగన్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రహదారులు, భవనాల శాఖకు చెందిన 4వేల కోట్ల ఆస్తులను ఆర్టీసీకి బదలాయించే అంశంపై ఈ భేటిలో మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఏపీ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించే ఛాన్స్ ఉంది. జాతీయ విద్యా విధానాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై కూడా మంత్రులు ఒక నిర్ణయానికి రానున్నారు. పోలవరం ముంపు బాధితులకు మరో 10లక్షలు అదనంగా ఇచ్చే అంశంపై కూడా సమీక్షించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story