సినిమా థియేటర్లకు ఏపీ సర్కార్ బొనాంజా ఏంటి?

సినిమా థియేటర్లకు ఏపీ సర్కార్ బొనాంజా ఏంటి?
x
Highlights

రైతు భరోసా మూడో విడత అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మూడో విడత కింద 2 వేలు ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఇప్పటికే ఈ ఏడాది...

రైతు భరోసా మూడో విడత అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మూడో విడత కింద 2 వేలు ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఇప్పటికే ఈ ఏడాది 12 వేలు చెల్లించామని వివరించారు. డిసెంబర్ 29న రైతుల ఖాతాలో 1,009 కోట్లు జమచేస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ అందిస్తామని చెప్పారు. పెట్టుబడి రాయితీని ఒక్క నెలలోనే చెల్లించేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేశామని పేర్ని నాని వెల్లడించారు.

పశుసంవర్థక శాఖలో 147 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్నినాని తెలిపారు. పులివెందులలో ఏపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని వివరించారు. రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు కేబినెట్లో ఆమోదం తెలిపామని చెప్పారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూసర్వే చేపట్టామని వెల్లడించారు. మూడేళ్లలో భూసర్వే పూర్తిచేసి భూహక్కు పత్రాల జారీ చేస్తామన్నారు. అలాగే ల్యాండ్ రికార్డుల తయారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని వివరించారు.

కొవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పర్యటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాబార్డు నుంచి 1,931 కోట్ల రుణం తీసుకోనేందుకు మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్ ప్యాకేజీ అమలు చేస్తామన్నారు. 1100 సినిమా థియేటర్లకు రుణాలు, వడ్డీపై రాయితీకి నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్నినాని వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories