logo
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Cabinet Expansion : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

Andhra Pradesh Cabinet Expansion : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు
X
Highlights

Andhra Pradesh Cabinet Expansion : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 22...

Andhra Pradesh Cabinet Expansion : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 22 మధ్యాహ్నం 1గంట తర్వాత రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల స్థానంలో ఇద్దరు కొత్త మంత్రులకు అవకాశం. ఆరోజు ప్రమాణ స్వీకారం చేయనున్న ఇద్దరు కొత్త మంత్రులు.

రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గం లో అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్య కార కుంటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మంత్రి వర్గ సభ్యుల పేర్లను రేపు అధికారికంగా వెల్లడించనున్న ప్రభుత్వం. మంత్రుల శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చంటోన్న అధికార పార్టీ నేతలు.


Web TitleAndhra Pradesh cabinet expansion likely on July 22
Next Story