Andhra Pradesh: గుంటూరు జిల్లా బాలుడి మర్డర్ కేసులో వీడిన మిస్టరీ
Andhra Pradesh: గుంటూరు జిల్లా మెల్లంపూడిలో జరిగిన బాలుడి మర్డర్ కేసులో మిస్టరీ వీడింది.
Andhra Pradesh: గుంటూరు జిల్లా బాలుడి మర్డర్ కేసులో వీడిన మిస్టరీ
Andhra Pradesh: గుంటూరు జిల్లా మెల్లంపూడిలో జరిగిన బాలుడి మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. అదే గ్రామానికి చెందిన గోపి అనే యువకుడు భార్గవ్ తేజను హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈనెల 14న ఇంటిదగ్గర ఆడుకుంటున్న భార్గవ్ తేజను అరటితోటలోకి తీసుకెళ్లిన గోపి లైంగిక దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కాళ్లు, చేతులు కట్టేసి మృతదేహాన్ని అరటితోటలో పడేసి పరారయ్యాడు. గతంలోనూ గోపి పలువురిపై లైంగిక దాడి, హత్యలకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అయితే గతంలోనూ గోపీ బాలాజీ అనే యువకుడిని హత్య చేశాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు బాలాజీ కుటుంబ సభ్యులు. ఆరోజే పోలీసులు గోపిపై చర్యలు తీసుకుని ఉంటే భార్గవ్ తేజ్ హత్య జరగకపోయేదన్నారు.
Next Story




