BJP: ఇవాళ ఢిల్లీకి బీజేపీ ఏపీ టీమ్

BJP: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో హస్తిన బాట * మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న బీజేపీ

Sandeep Eggoju
Published on: 3 Aug 2021 6:26 AM IST
Andhra Pradesh BJP Team Going to Delhi Today
X

ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ బీజేపీ టీం (ఫైల్ ఇమేజ్)

BJP: ఏపీ బీజేపీ టీం ఇవాళ ఢిల్లీకి వెళ్లనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో మూడు రోజుల పాటు హస్తీనలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు పార్టీ పెద్దలతో కూడా సమావేశం కానున్నారు.. ఈ పర్యటనలో సోము వీర్రాజు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి ఏపీ ఆర్ధిక పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు. అటు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, తదితర ఆర్థిక లావాదేవీలపై ఆర్బీఐకి ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సైతం ఏపీ ప్రభుత్వ అప్పుల వ్యవహారాన్ని కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వారికి నివేదించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story