Andhra Pradesh Bandh Live Updates: ఏపీ బంద్
Andhra Pradesh Bandh Live Updates: ఆంధ్రప్రదేశ్ లో విశాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం బంద్ చేపట్టారు
Steel Plant: ఆంధ్రప్రదేశ్ లో విశాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం బంద్ చేపట్టారు. ఇందులో లో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో బంద్ ఇలా..
Live Updates
- 5 March 2021 9:51 AM IST
Andhra Pradesh Bandh Live Updates: విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లా:
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్షాలు చేపడుతున్న బంద్ విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా కోనసాగుతోంది. బందుకు ప్రభుత్వం మద్దతివ్వడంతో జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
- 5 March 2021 9:50 AM IST
Andhra Pradesh Bandh Live Updates: అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా:
అనంతపురం జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విశ్వవిద్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేశారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బందుకు మద్దతు తెలపాయి. ప్రభుత్వం సంఘీభావం ప్రకటించడంతో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి
- 5 March 2021 9:48 AM IST
Andhra Pradesh Bandh Live Updates: శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా:
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో స్వచ్ఛంధంగా బందు కొనసాగుతోంది. జిల్లాలో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. వాణిజ్య సంస్థలు, స్కూలు, కాలేజీలు స్వచ్చంధంగా బందును పాటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హెడ్ పోస్టు ఆఫీసు వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఇదే అంశంపై సిక్కోలు నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు.



