30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Arun Chilukuri
Published on: 26 Nov 2020 6:59 PM IST
30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
X

ఈనెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ఐదు రోజులపాటు శీతాకాల సమావేశాలను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం రోజునే బీఏసీ సమావేశం జరగనున్నది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై బీఏసీలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కీలక బిల్లులతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటుపై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంది. కోర్టు పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి సభలో సీఎం జగన్ ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story