కొవిడ్‌ టీకా వేయించుకున్న ఆశా వర్కర్‌ మృతి

Arun Chilukuri
Published on: 24 Jan 2021 12:45 PM IST
కొవిడ్‌ టీకా వేయించుకున్న ఆశా వర్కర్‌ మృతి
X

కొవిడ్‌ టీకా వేయించుకున్న ఆశా వర్కర్‌ మృతి

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఆశా వర్కర్‌ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశా వర్కర్‌ బొక్కా విజయలక్ష్మికి ఈ నెల 19వ తేదీన కరోనా వ్యాక్సిన్‌ వేశారు. రెండు రోజులు బాగానే ఉన్న ఆమెకు 21న తెల్లవారుజామున చలి, జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జిజిహెచ్‌)కి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స పొందుతూ విజయలక్ష్మి చనిపోయారు. దీంతో విజయలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆశావర్కర్లు జీజీహెచ్‌ ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story