ప్రేమ పేరుతో వేధింపులు, టెన్త్‌ విదార్థిని ఆత్మహత్య

ప్రేమ పేరుతో వేధింపులు, టెన్త్‌ విదార్థిని ఆత్మహత్య
x
Highlights

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువకుడు వేధింపులకు పదో తరగతి విద్యార్థిని బలి అయింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం...

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువకుడు వేధింపులకు పదో తరగతి విద్యార్థిని బలి అయింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. కొర్రపాడుకు చెందిన సౌమ్య పదో తరగతి చదువుతోంది. ఆమెను అదే ప్రాంతానికి చెందిన వర ప్రసాద్ కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. వరప్రసాద్ వేధింపులు భరించలేక బాలిక గడ్డి మందు తాగి నాలుగు రోజుల క్రితం ఆత్మాహత్యాయత్నం చేసింది.

కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ప్రాణాలు విడిచింది. వరప్రసాద్ వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్టు సెల్ఫీ వీడియోలో సౌమ్య వెల్లడించింది. వరప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలని కోరింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేశారు. అయితే బాధిత కుటుంబాన్ని తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరామర్శించారు. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామినిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories