కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన భేటీ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన భేటీ
x
Highlights

రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్టు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు....

రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్టు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాధ్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటన చేపట్టారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు జీఎస్టీ బకాయిలు, వివిధ ఇతర పధకాల నిధులపై కేంద్ర ఆర్ధిక మంత్రితో చర్చించామని మంత్రి బుగ్గన తెలిపారు. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని మరోసారి చర్చించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు 3 వేల కోట్లకు పైగా జీఎస్టీ బకాయిలు రావల్సి ఉంది. అటు పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధుల్ని రీయింబర్స్ చేయాల్సి ఉందిని చెప్పారు. బుగ్గనతో పాటు ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories