ఆ యువతితో సహా కోర్టుకు రండి : ఎస్పీకి హైకోర్టు ఆదేశం

Arun Chilukuri
Published on: 2 Sept 2020 11:53 AM IST
ఆ యువతితో సహా కోర్టుకు రండి : ఎస్పీకి హైకోర్టు ఆదేశం
X

High Court: అనంతపురం జిల్లా ఎస్పీని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తన భార్యను ఆమె తండ్రి అక్రమంగా నిర్భంధించారని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే యువకుడు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం నాడు విచారణ చేసింది. ప్రభుత్వ న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ది ప్రేమ వివాహమని, ప్రస్తుతం ఆ యువతి వారి తల్లిదండ్రుల వద్ద ఉంటోందన్నారు. పిటిషన్లోని వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఆ యువతిని తీసుకొని గురువారం కోర్టుకు రావాలని ఎస్పీని ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story