తీరనున్న మత్స్యకారుల కలలు

తీరనున్న మత్స్యకారుల కలలు
x
Highlights

మరో బృహత్తర ప్రాజెక్టుకు ఏపీ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. తీర ప్రాంతంలో తొలి దశలో నిర్మించనున్న 4 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలకు సీఎం జగన్‌ వర్చువల్‌...

మరో బృహత్తర ప్రాజెక్టుకు ఏపీ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. తీర ప్రాంతంలో తొలి దశలో నిర్మించనున్న 4 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలకు సీఎం జగన్‌ వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు. త్వరలో మిగిలిన నాలుగు చోట్ల కూడా పనులు మొదలుపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న ఫిషింగ్‌ హార్బర్‌కు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే వీటికోసం టెండర్లను ఆహ్వానించారు. డిసెంబర్‌ రెండో వారంలో వీటిని ఖరారు చేస్తారు.

జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి 289 కోట్లు, నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి 451 కోట్లు, మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి 348 కోట్లు, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి 422 కోట్ల రూపాయలు, మొత్తంగా 1,510 కోట్లు తొలిదశ ప్రాజెక్టు వ్యయంగా నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, విశాఖ జిల్లా పూడిమడక పశ్చిమగోదావరి జిల్లా బియ్యపు తిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్‌ హార్బర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి సుమారు 3వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories