అమరావతిలో 'అసైన్డ్‌' ప్లాట్ల కేటాయింపులు రద్దు

అమరావతిలో అసైన్డ్‌ ప్లాట్ల కేటాయింపులు రద్దు
x
Highlights

రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. టిడిపి కాలంలో ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2015 ద్వారా రాజధాని నిర్మాణానికి భారీగా భూములు సేకరించింది. కొంతమంది రాజకీయ నాయకులు గతంలో కేటాయించిన దళితులు,పేదల భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. ఆ తరువాత సిఆర్డిఎ వారినుంచి ఈ భూములను సేకరించి బదులుగా వారికి వాణిజ్య మరియు నివాస స్థలాలను ఇచ్చింది. వాస్తవానికి అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడానికి కుదరదు.. నిషేధ చట్టం (పిఒటి) 1977 ప్రకారం చట్టవిరుద్ధం.

పైగా అసైన్డ్‌ భూములు సేకరించి బదులుగా వారికి ప్లాట్లు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమే అవుతుంది. దాంతో ఈ ప్లాట్లను ప్రభుత్వం రద్దు చేసింది. ల్యాండ్ పూలింగ్ కింద అసైన్డ్‌ భూములను ఇచ్చిన రైతులకు 500 ఎకరాల నివాస భూమి, 50 గజాల వాణిజ్య భూమి, 500 గజాల నివాస భూమి, 100 గజాల వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్లాట్ల కేటాయింపును రద్దు చేయాలని కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాట్లను రద్దు చేయాలని మున్సిపల్ సెక్రటరీ జనరల్ జె. శ్యామల రావు ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories