ఏపీలో డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ

X
Highlights
కోర్టు స్టేలతో వాయిదా పడుతూ వస్తోన్న ఇళ్ల స్థలాల పంపిణీకి జగన్ సర్కార్ కొత్త ఎత్తు వేసింది. కోర్టు స్టేలు...
Arun Chilukuri18 Nov 2020 10:34 AM GMT
కోర్టు స్టేలతో వాయిదా పడుతూ వస్తోన్న ఇళ్ల స్థలాల పంపిణీకి జగన్ సర్కార్ కొత్త ఎత్తు వేసింది. కోర్టు స్టేలు ఉన్నాసరే డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కోర్టు స్టేలు లేని ప్రాంతాల్లో డి-ఫామ్ పట్టాతో ఇళ్ల స్థలాలను కేటాయించనున్నారు. డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతోపాటు అదేరోజు ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇళ్ల స్థలాల పంపిణీకి ఇప్పటివరకు 30లక్షల 68వేల 281 లబ్దిదారులను గుర్తించిన ప్రభుత్వం తొలి దశలో 15లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.
Web TitleAndhra government decides to distribute house sites pattas to the poor on December 25th
Next Story