అనంతపురం జిల్లాలో 3 రిజర్వాయర్లకు సీఎం జగన్‌ శంకుస్థాపన

Arun Chilukuri
Updated on: 9 Dec 2020 4:39 PM IST
అనంతపురం జిల్లాలో 3 రిజర్వాయర్లకు సీఎం జగన్‌ శంకుస్థాపన
X

రాయలసీమలో మరో లక్ష ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో మూడు రిజర్వాయర్లకు ఏపీ సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతపురం జిల్లాలో తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్ల పనులను ప్రారంభించిన జగన్ రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్లు, హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటి తరలించనున్నట్లు తెలిపారు. దీంతో 7 మండలాల్లోని 35 గ్రామాలకు మేలు జరుగుతోందన్నారు. రిజర్వాయర్లు, ప్రధాన కాల్వల కోసం 800 కోట్లు విడుదల చేశామన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story