Anantapur - Current Bill: అనంతపురం జిల్లాలో రైతులకు కరెంట్ బిల్లు షాక్

Anantapur - Current Bill: * ఒకరి ఇంట్లో కరెంట్ బిల్ రూ.1,48,371 * మరో రైతుకు రూ.78,167

Shireesha
Published on: 28 Aug 2021 11:03 AM IST
Anantapur Farmers Shocked by Seeing Above 1 Lakh Current Bill | Telugu Online News
X

అనంతపురం జిల్లాలో రైతులకు కరెంట్ బిల్లు షాక్

Anantapur - Current Bill: అతడో సాధారణ కూలీ. రోజూ పనికెళ్తే తప్ప పూట గడవదు.. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ చేదోడుగా ఉంటోంది. ఇంట్లో ఓ టీవీ.. ఫ్యాన్.. మూడు కరెంట్ బల్బులు తప్ప ఇంకేమీ లేవు.. అంతటి పేదోడికి పెద్ద షాక్ తగిలింది. కరెంటోళ్లు ఇచ్చిన బిల్లు చూసి గుండె గుభేల్‌మంది. ఆ ఇంటికి వచ్చిన బిల్లు మొత్తం లక్షకు పైనే ఉంది. ప్రతి నెల 200 నుంచి 300 వచ్చే బిల్లు ఈ సారి ఏకంగా లక్ష దాటడం అందరూ అవాక్కయ్యారు... ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప అనే వ్యక్తికి ఎదురైంది.

పర్వతాలకు నెలకు 200 నుంచి 300 దాకా వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఏకంగా లక్షా 48 వేల 371 రావడంతో కలవరపాటుకు గురయ్యాడు. విద్యుత్ సిబ్బందిని పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు.. అంతేకాదు.. అదే గ్రామానికి చెందిన బండయ్య అనే వ్యక్తికి ఒకసారి 78 వేల 167, ఇంకోసారి 16 వేల 251 రూపాయల బిల్లులు వచ్చాయి.. సాధారణ కూలీ పని చేసి జీవితం తమకు ఇంత కరెంటు బిల్లు వస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కరెంటు బిల్లు ఎక్కువ రాకుండా చేయాలని కోరుతున్నారు. కరెంటు మీటర్ బాక్సులలో సమస్యలు ఉంటే పరిష్కారించాలని వారు కోరుతున్నారు.

Shireesha

Shireesha

Next Story