Anantapur: రైతుల ఆందోళన.. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి దిగ్బంధం

Anantapur: అనంతపురం జిల్లాలో రైతుల ఆందోళన

Shekhar G
Published on: 20 Dec 2023 6:54 PM IST
Anantapur Farmers Protest Of Hyderabad Bangalore National Highway
X

Anantapur: రైతుల ఆందోళన.. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి దిగ్బంధం

Anantapur: అనంతపురం జిల్లాలో రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు. మెడ్ పెన్నార్ రిజర్వాయర్ నార్త్ కెనాల్ కింద సాగుచేసిన పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయని జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పెద్దవడుగూరు మండలం మిడతూరు దగ్గర మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి రాస్తారోకో చేపట్టారు. జనవరి 10 వరకు ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పిన అధికారులు నవంబర్ నెలలోనే నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story