Anandayya Medicine: తూర్పుగోదావరి జిల్లాలో ఆనందయ్య మందు పంపిణి

Anandayya Medicine: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా బాధితులకు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

Arun Chilukuri
Updated on: 20 Jun 2021 1:31 PM IST
Anandayya Medicine Distribution in East Godavari
X

Anandayya Medicine: తూర్పుగోదావరి జిల్లాలో ఆనందయ్య మందు పంపిణి

Anandayya Medicine: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా బాధితులకు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా కట్టడికి తయారు చేసిన మందును రాజోలు గ్రామానికి చెందిన మురళీకృష్ణరెడ్డి పంపిణీ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని ఆయుర్వేద మందు తయారు చేస్తున్న ఆనందయ్యకు వనమూలికలు, పట్టుతేనె, నల్ల జీలకర్ర, నేల ఉసరి వంటి వస్తువులు అందిస్తున్నారు.

ఆయుర్వేద మందును కరోనా బాధితులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వారికి ఉచితంగా అందిస్తూ అందరి మనన్నలుపొందుతున్నారు. ఆక్సిజన్ లెవల్స్ బాగా తగ్గిన వారికి అత్యవసరమైన మందు అందిస్తున్నారు. రాజోలు పరిసర ప్రాంతాల్లోని వారికే కాకుండా ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నారు. గ్రామస్తులకు మురళీకృష్ణ అందిస్తున్న సేవల పట్ల పలువురు అభినందిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story