వైసీపీ ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు
x

వైసీపీ ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు

Highlights

*రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఎమ్మెల్యేలను ఆహ్వానించలేదు: ఆనం *పరేడ్‌‌లో పాల్గొనే అర్హత ఎమ్మెల్యేలకు లేదా?: ఆనం *అధికారుల నిర్లక్ష్యమా? లేక అహంకారమా?: ఆనం

వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఎమ్మెల్యేలను ఆహ్వానించ లేదన్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనే అర్హత ఎమ్మెల్యేలకు లేదా? అంటూ ఆనం ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యమా? లేక అహంకారమా? అంటూ నిలదీశారు. ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదో అధికారులు చెప్పాలన్న ఆనం తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అవమానం జరగలేదన్నారు. తాను ఒక్కడినే కాదని నెల్లూరు జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇదేనన్నారు. ఇక, రిపబ్లిక్‌డే వేడుకలను నన్ను ఆహ్వానించని అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కోర్టుకు వెళ్లనున్నట్లు ఆనం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories