Vijayasri Pharma Company: విశాఖలో మరోసారి పేలుడు.. తప్పిన పెను ప్రమాదం
Vijayasri Pharma Company: విశాఖపట్నంలో మరోసారి పేలుడు ఘటన చోటు చేసుకుంది. అచ్యుతాపురం విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. భయంతో కార్మికులు పరుగులు తీశారు. పేలుడు ధాటికి మంటలు ఎగసి పడ్డాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేసింది. భారీ ప్రమాదం తృటిలో తప్పింది. పేలుడు దాటికి రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. విశాఖ పరిశ్రమల్లో గత రెండు నెలలుగా వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన నాటి నుంచి వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విజయశ్రీ ఫార్మాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వరుస ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Next Story




