మోడీకి రాజధాని రైతుల లేఖలు

మోడీకి రాజధాని రైతుల లేఖలు
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీకి రాజధాని అమరావతి రైతులు లేఖలు రాశారు. రాజధాని పేరుతో తమకు అన్యాయం చేశారంటూ ప్రధానికి లేఖలు రాశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ...

ప్రధాని నరేంద్ర మోడీకి రాజధాని అమరావతి రైతులు లేఖలు రాశారు. రాజధాని పేరుతో తమకు అన్యాయం చేశారంటూ ప్రధానికి లేఖలు రాశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములు సేకరించిన తీరుతో పాటు ఆయా సమయాల్లో ఇచ్చిన హామీలు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనను వివరిస్తూ మూడు పేజీల లేఖ రాశారు. దీంతో పాటు తమ ఆధార్ కార్డులను జతపరిచారు. త్రివిధ రాజధానులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ స్పీడ్ పోస్ట్ ద్వారా తమ సందేశాన్ని ప్రధానికి పంపారు.

రాజధాని గ్రామాల్లో రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాజధాని అంశంపై న్యాయవాదుల నిరసనకు దిగారు. తుళ్లూరు నుంచి హైకోర్టు వరకు ర్యాలీ చేపట్టారు. హైకోర్టుకు చేరుకుని అక్కడ న్యాయవాదులు నిరసన తెలపనున్నారు. ఇటు తుళ్లూరులో రైతుల తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ గోడు వినిపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories