West Godavari: ఐస్‌ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్‌

West Godavari: నలుగురు మహిళల పరిస్థితి విషమం

Shekhar G
Published on: 7 Oct 2023 10:36 AM IST
Ammonia Gas Leak At Ice Factory In West Godavari
X

West Godavari: ఐస్‌ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్‌

West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం రేగింది. కాళ్ళ మండలం కోపల్లిలోని ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం ఐస్ ఫ్యాక్టరీలో ఉన్న కంప్రెషర్ ఊడదీయడంతో గ్యాస్ లీకైంది. మూసేసి ఉన్న ఐస్ ఫ్యాక్టరీలో కంప్రెషర్‌ను విక్రయించేందుకు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. అమ్మోనియా గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడంతో పక్కన ఉన్న రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నలుగురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని భీమవరం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిషన్ తొలగించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story